ఆ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదు : మోహన్ బాబు
పార్టీ పెట్టి డబ్బులు దండుకునే ఆలోచనలేదని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి చిరంజీవిని ఉద్దేశించి కాదని సినీనటుడు మోహన్ బాబు వివరణ ఇచ్చారు. చిరంజీవి తనకు మంచి స్నేహితుడని చెప్పారు. అయితే, తాను రాజకీయాల్లోకి రావలనుకోవడం దైవ నిర్ణయమని.. ఏ పార్టీలో చేరేది ఇప్పుడేమీ చెప్పనని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు డబ్బులు తీసుకొనే సీట్లు ఇస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని మోహన్ బాబు ఈ రోజు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పార్టీల తీరువల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విదేశాల తరహాలో ఇక్కడా కఠిన శిక్షలు విధిస్తే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో 730 ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదలకాక పోవడంతో లెక్చరర్లకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని మోహన్ బాబు వాపోయారు.